డబ్ల్యూహెచ్ఓ నివేదికల ప్రకారం సిఫార్సు చేసిన పరిమితి కంటే ఎక్కువ అల్యూమినియం శరీరంలోకి చేరడం దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. పాత్రల ఉపరితలంపై సహజ ఆక్సైడ్ పొర రక్షణ కల్పించినప్పటికీ, ఫాయిల్ విషయంలో ఆమ్ల స్వభావం కలిగిన ఆహారాలు రసాయన ప్రతిచర్యకు గురవుతాయి. ముఖ్యంగా చికెన్, చేపలు, మసాలా కూరలను అల్యూమినియం ఫాయిల్‌లో పెట్టి బేక్ చేయడం లేదా ఎక్కువ రోజులు ఉంచడం మానుకోవాలని నిపుణులు కోరుతున్నారు.

అభ్యుదయం దినపత్రిక (పేజీ 7)