డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వస్తున్న ఆరోపణలకు సీఎం చంద్రబాబు స్పందించారు. తన పాలనా కాలంలో జరిగిన డీఎస్సీ, ఏపీపీఎస్సీ పరీక్షల్లో అవినీతి లేదా ప్రశ్నపత్రాల లీకేజీకి తావులేదని చెప్పారు.
మెగా డీఎస్సీ 2025 నియామక ప్రక్రియను అడ్డుకోవడానికి 355 పిటిషన్లు దాఖలైనా, ప్రక్రియను చట్టబద్ధంగా, పారదర్శకంగా పూర్తి చేశామని తెలిపారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వారు గత ప్రభుత్వం జారీ చేసిన ధ్రువపత్రాల ఆధారంగానే ఎంపికయ్యారని అన్నారు.
నియామకాల్లో ఎవరికైనా అభ్యంతరాలుంటే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని సీఎం పేర్కొన్నారు. ఉపాధ్యాయులపై దాడులు, రాజకీయ రౌడీయిజాన్ని ఉపేక్షించబోమని హెచ్చరించారు.





