రుణ వసూళ్ల ప్రక్రియలో రుణగ్రహీతల హక్కులను రక్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. రికవరీ ఏజెంట్లు, బ్యాంకులు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల లోపే ఫోన్ ద్వారా సంప్రదించాలని పేర్కొంది.

రుణగ్రహీతలను బెదిరించడం, దుర్భాషలాడటం, బహిరంగంగా పరువు తీసే చర్యలకు పాల్పడకూడదని ఆదేశించింది. వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, ఆడియోలను సోషల్ మీడియాలో పంచుకోవడం కూడా నిషేధమని స్పష్టం చేసింది.

రికవరీ బాధ్యతను ఇతర సంస్థలకు అప్పగించినా, ఏజెంట్ల ప్రవర్తనకు రుణదాత సంస్థలే బాధ్యులని ఆర్‌బీఐ తెలిపింది. కొత్త నిబంధనలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని కథనం పేర్కొంది.