అమరావతిలో మాట్లాడిన మంత్రి నిమ్మల రామానాయుడు, పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని అన్నారు. ప్రాజెక్టు పురోగతి, పునరావాస పనులు, నిధుల అంశాలపై ప్రభుత్వం స్పష్టతతో పనిచేస్తోందని చెప్పారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు, వ్యయ అంచనాల్లో జరిగిన మార్పులను ప్రస్తావిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు.