పండుగ ఉత్సాహంలో యువత గంటల తరబడి చెవులు దద్దరిల్లే డీజేల ముందు డ్యాన్సులు చేయడం నిత్యకృత్యమైంది. అయితే ఇటీవల ఊరేగింపుల్లో పాల్గొన్న కొందరు అస్వస్థతకు గురై మరణిస్తున్న ఘటనల నేపథ్యంలో వైద్యులు ఈ తీవ్ర అంశాన్ని తెరపైకి తెచ్చారు. వినికిడి వ్యవస్థతో పాటు కేంద్ర నాడీ వ్యవస్థను డీజే మోత తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. తీవ్రమైన శబ్దానికి గురైనప్పుడు రక్తనాళాలు కుంచించుకుపోయి రక్తపోటు అమాంతం పెరుగుతుంది. ఇది దీర్ఘకాలంలో ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్, హైపర్‌టెన్షన్‌కు కారణమవుతుందని అంతర్జాతీయ పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. లోపలి చెవిలోని సున్నితమైన కణాలు దెబ్బతినడం వల్ల చెవులు మూసుకుపోవడం, ‘టిన్నిటస్’ (చెవుల్లో రింగుమనే శబ్దం), శాశ్వత బధిరత్వం వచ్చే ముప్పు పొంచి ఉంది. భారీ శబ్దాల నడుమ ఛాతీలో నొప్పి, తీవ్రమైన గుండెదడ, ఊపిరి ఆడకపోవడం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే అత్యవసర వైద్య చికిత్స తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
డీజే భారీ మోతతో గుండెకు తీవ్ర ముప్పు.. వైద్య నిపుణుల హెచ్చరిక!
వినాయక నిమజ్జన ఊరేగింపుల్లో హోరెత్తే డీజే శబ్దాలు కేవలం వినికిడి లోపానికే కాకుండా ప్రాణాంతకమైన గుండె జబ్బులకు దారితీస్తాయని వైద్య నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అధిక శబ్ద తీవ్రతతో శరీరంలో ఒత్తిడి పెరిగి గుండె కొట్టుకునే వేగం, రక్తపోటులో ఆకస్మిక మార్పులు సంభవిస్తాయని స్పష్టం చేస్తున్నారు
అక్షర పరిమాణం
- 00 డెసిబుల్స్ శబ్దానికి వారానికి 20 నిమిషాలు, 110 డెసిబుల్స్ తీవ్రతకు కేవలం 2.5 నిమిషాలు మాత్రమే సురక్షితమైన పరిమితిగా డబ్ల్యూహెచ్‌వో (WHO) నిర్ధారించింది.
- గంటల తరబడి ఎండలో డ్యాన్సులు, తీవ్ర శారీరక శ్రమ, డీహైడ్రేషన్‌కు అధిక శబ్దం తోడైతే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.






