హైదరాబాద్, సెప్టెంబర్ 3: డెమోక్రాటిక్ జర్నలిస్ట్స్ యూనియన్ (DJU) తెలంగాణ రాష్ట్ర అడ్ హాక్ కమిటీని ఏర్పాటు చేసింది. యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బళ్ళ రాధాకృష్ణ, వ్యవస్థాపక సభ్యుడు మరిదు ప్రసాదబాబు సంయుక్తంగా కమిటీ సభ్యులను నియమించారు.

కన్వీనర్‌గా జై భీమ్ టీవీకి చెందిన డాక్టర్ బరిగెల శివను నియమించారు. ఆయన జర్నలిజం రంగంలో ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, సామాజిక అంశాలను వెలుగులోకి తీసుకువస్తున్నందుకు ఈ బాధ్యత దక్కిందని జర్నలిస్టు వర్గాలు అభినందించాయి.

కమిటీ సభ్యులుగా ఉరిటి హిమబిందు (ఐ న్యూస్), కొత్త కల్పన (ఇండియన్ రిపబ్లిక్ టీవీ), *ఎం.ఎస్. ఆనందరావు (6 టీవీ)*, వి. జ్యోతిబసు (రాజ్ న్యూస్), వన్నాల వేణు (జీ టీవీ), డి.ఆర్.కె. రాజు (సాక్షి), విజయ్ సాధు (డయల్ న్యూస్), స్టాలిన్ మర్లపాటి (నేషనలిస్ట్ హబ్ల) నియమితులయ్యారు.

యూనియన్ నాయకులు మాట్లాడుతూ, తెలంగాణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి హక్కుల పరిరక్షణ, సంక్షేమం, చిన్న మరియు స్వతంత్ర మీడియా సంస్థలకు ప్రోత్సాహం వంటి అంశాలపై అడ్ హాక్ కమిటీ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

జర్నలిస్టుల ఐక్యతను బలోపేతం చేయడం, వృత్తిపరమైన హక్కులు, సంక్షేమం కోసం పోరాడటం అడ్ హాక్ కమిటీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ నియామకం ద్వారా DJU తెలంగాణలో తన కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తోందని జర్నలిస్టు వర్గాలు అభిప్రాయపడ్డాయి