వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. నిమజ్జన ఘాట్ల వద్ద భద్రత, తాగునీరు, విద్యుత్, శానిటేషన్ వంటి సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని ప్రజలు నిర్దేశిత మార్గాలు, సూచనలు పాటించాలని కోరారు.