నిద్రలేమి, ధూమపానం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల కండరాల క్షీణత జరిగి జీవక్రియలు మందగిస్తాయి. ఆహారంలో మిరపకాయల్లో లభించే క్యాప్సైసిన్ వంటి సహజ పదార్థాలు కొవ్వును కరిగించడంలో తోడ్పడతాయి. అలాగే రోజుకు సరిపడా గోరువెచ్చని నీరు తాగడం, ఉడికించిన బంగాళాదుంపలు, గుడ్లు, చేపలు వంటి అధిక ఫైబర్, ప్రోటీన్ ఉన్న ఆహారాలను తీసుకోవడం ద్వారా మెటబాలిజాన్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.