ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం వాయుగుండంగా, ఆదివారానికి తీవ్ర వాయుగుండంగా బలపడనుందని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రాయలసీమతో పాటు కోస్తాంధ్ర అంతటా విస్తారంగా వర్షాలు పడతాయన్నారు. శుక్రవారం నాటికే కర్నూలు జిల్లా దూదేకొండలో అత్యధికంగా 68 మి.మీ వర్షపాతం నమోదైందని, అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

అభ్యుదయం దినపత్రిక (పేజీ 6)