సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కూకట్‌పల్లి సర్కిల్-52లో గురువారం ఉదయం కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ జి. సృజన, ఐఏఎస్ క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్, ఐఏఎస్‌తో కలిసి ఆమె పలు కీలక పౌర మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు.
ఈ పర్యటనలో భాగంగా కూకట్‌పల్లి వై జంక్షన్ పరిధిలోని HCITI పనులను కమిషనర్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. పనుల పురోగతిపై అక్కడి ఇంజనీరింగ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ (CE) శ్రీలక్ష్మి, చీఫ్ సిటీ ప్లానర్ (CCP) వెంకన్న, సిటీ ప్లానర్ (CP) తులసీరామ్, కూకట్‌పల్లి సర్కిల్-52 డిప్యూటీ కమిషనర్ (DC) జి. ఆంజనేయులు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ACP) వెంకటరమణతో పాటు ఇతర కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






