సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బుధవారం జరిగిన సొసైటీ ఎన్నికల్లో కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ నవీన్ ట్రెజరర్‌గా ఎన్నికయ్యారు. ఈ విజయంతో కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు సైబరాబాద్ పోలీసులు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కానిస్టేబుల్ నవీన్ మాట్లాడుతూ తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఉద్యోగస్తుల సమస్యలను పరిష్కరించే దిశగా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనతో పాటు గెలుపొందిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు.
సైబరాబాద్ పోలీస్ సొసైటీ ఎన్నికల్లో ట్రెజరర్‌గా కానిస్టేబుల్ నవీన్
సైబరాబాద్ పోలీస్ సొసైటీ ఎన్నికల్లో కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ నవీన్ ట్రెజరర్‌గా ఎన్నికయ్యారు.
అక్షర పరిమాణం
- గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన నవీన్.
- ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ.






