ఎస్సీ, ఎస్టీల రక్షణ, సంక్షేమం, విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారత, వైద్యారోగ్యం తదితర అంశాలపై రాష్ట్రస్థాయి అత్యున్నత కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు.

గుంటూరు, అనంతపురం, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదవుతున్న అంశాన్ని సమావేశంలో పరిశీలించారు. కేసుల సంఖ్యతో పాటు వాటి స్వభావం, కారణాలు, పరిష్కారానికి పడుతున్న సమయం వంటి అంశాలపై ప్రత్యేక అధ్యయనం చేయాలని సీఎం సూచించారు.

ప్రత్యేక సెషన్‌ కోర్టులు, ప్రత్యేక కోర్టుల్లో కేసులను వేగంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా తప్పు చేసిన వారికి శిక్ష పడేలా వ్యవస్థ పనిచేయాలని ఆయన సూచించారు.