కొరియర్, లాజిస్టిక్స్ సేవల పేరుతో ప్రజలను మోసం చేసే సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కథనం పేర్కొంది.
కొంతమంది సైబర్ నేరగాళ్లు కొరియర్‌లో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని, కస్టమ్స్ లేదా పోలీసుల పేరుతో కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తూ బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిపింది.
ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజ్‌లు వస్తే వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం, OTPలను ఎవరికీ వెల్లడించకుండా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.