క్యాన్సర్ మందులపై భారీ మార్జిన్ల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. బ్రాండెడ్, జనరిక్, దిగుమతి చేసుకునే మందులన్నింటికీ 30 శాతం మార్జిన్ పరిమితి వర్తిస్తుందని తెలిపింది. క్యాన్సర్ ఔషధాల ధరలు ఆకాశాన్నంటుతుండటంపై ఇటీవల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ దిద్దుబాటు చర్యను వేగవంతం చేసింది.