పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన తుపాను గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకనుందని వాతావరణ శాఖ తెలిపింది. పంటల నష్టాన్ని నివారించేందుకు పొలాల్లో నిలిచిన నీటిని తొలగించేందుకు మురుగు కాలువలను సిద్ధం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ప్రాణ రక్షణకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, ధాన్యం తడవకుండా టార్పాలిన్లతో కప్పి భద్రపరచుకోవాలని రైతులకు మార్గదర్శకాలు జారీ చేశారు.