విజయదశమి పండుగ ప్రయాణాల కోసం ఏపీఎస్ఆర్టీసీ పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు అత్యధికంగా 1,186 బస్సులు, విజయవాడకు 1,053, బెంగళూరుకు 475 బస్సులను నడపనున్నారు. సాధారణ ఛార్జీలతోనే సర్వీసులు నడుపుతున్నందున ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.
దసరా పండుగకు ఏపీఎస్ఆర్టీసీ 5,261 ప్రత్యేక బస్సులు: సాధారణ ఛార్జీలే వర్తింపు
దసరా పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ 5,261 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులకు ఊరట కల్పిస్తూ ఈ ప్రత్యేక బస్సుల్లో ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని స్పష్టం చేసింది.
అక్షర పరిమాణం
- ఈ ప్రత్యేక బస్సులు అక్టోబర్ 16 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా మరియు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల నుంచి అందుబాటులో ఉంటాయి.
- పండుగకు ముందు 3,207 బస్సులు, తిరుగు ప్రయాణాల కోసం 2,054 బస్సులను ఆర్టీసీ కేటాయించింది





