రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న పురపాలక ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ రిజర్వేషన్ల తుది జాబితాను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితా ప్రకారం 106 మున్సిపాలిటీలు, 17 మున్సిపల్ కార్పొరేషన్లకు రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. ఎస్టీ కేటగిరీలో 3 స్థానాలను కేటాయించగా, అందులో గూడూరును మహిళలకు, ఆత్మకూరు, ఆలూరులను జనరల్‌కు కేటాయించారు. ఎస్సీ కేటగిరీకి 14 స్థానాలు కేటాయించగా, వాటిలో 7 మహిళలకు, 7 జనరల్‌కు నిర్దేశించారు. బీసీ వర్గానికి కేటాయించిన 36 స్థానాల్లో 18 మున్సిపాలిటీలను మహిళలకు (జంగారెడ్డిగూడెం, నర్సీపట్నం, కొవ్వూరు, పాలకొల్లు తదితరాలు), 18 మున్సిపాలిటీలను జనరల్‌కు (కావలి, కదిరి, హిందూపురం, నంద్యాల తదితరాలు) ఖరారు చేశారు. అలాగే జనరల్ విభాగంలో మొత్తం 27 మున్సిపాలిటీలను మహిళలకు కేటాయించడంతో అన్ని వర్గాల మహిళలకు ప్రాధాన్యం లభించింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవడంతో అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించేందుకు రాజకీయ పార్టీలకు మార్గం సుగమమైంది.
For more information on this article please read page number 1 & 3 dated on 13-10-2026 in Abhyudayam E-paper.






