రామదాసు, అన్నమాచార్య కీర్తనలతో పాటు గణపతి పాటలకు చిన్నారులు నృత్యాలు ప్రదర్శించారు.

విష్ణువు, శివుడు, జగన్మాత వేషధారణల్లో చిన్నారుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ప్రధాన కథనం

కూకట్‌పల్లిలోని వివేకానంద నగర్ కాలనీ అపార్ట్‌మెంట్స్ ప్రాంగణంలో కూచిపూడి నృత్య విభావరి ఘనంగా నిర్వహించారు. కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు.

మయూరి డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని అకాడమీ నిర్వాహకులు శ్రీదేవి, నందిత పర్యవేక్షించారు. కార్యక్రమంలో అకాడమీ విద్యార్థినులు, చిన్నారులు ప్రత్యేక వేషధారణలతో ఆధ్యాత్మిక గీతాలకు నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.

రామదాసు, అన్నమాచార్య కీర్తనలతో పాటు గణపతి పాటలకు వారు చేసిన కూచిపూడి నృత్యాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విష్ణువు, శివుడు, జగన్మాత వేషధారణల్లో చిన్నారులు చేసిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కార్యక్రమం అనంతరం కాలనీ అసోసియేషన్ సభ్యులు నృత్యకారులను అభినందించి, బహుమతులు అందజేశారు.