అభ్యుదయం- డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో బినామీ ఆస్తుల వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఎనిమిది మందిని అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌లోని పుప్పాలగూడలో వారి ఇళ్లపై ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్‌ నేతృత్వంలో కొనసాగుతున్న తనిఖీల్లో ఆస్తులకు సంబంధించిన పత్రాలు, ఆర్థిక లావాదేవీల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. సోదాల్లో లభించిన పత్రాలు, ఆధారాలపై తదుపరి విచారణ చేపట్టనున్నారు.