జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (JPL) ప్రతిపాదిత మెగా ఐపీవో దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో సరికొత్త మైలురాయిని లిఖించింది. మొత్తం రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యంలో భాగంగా ప్రారంభించిన యాంకర్ బుక్ కేటాయింపులకు అంతర్జాతీయ దిగ్గజ సంస్థల నుంచి సుమారు రూ.2.5 లక్షల కోట్ల విలువైన బిడ్లు వచ్చినట్లు సమాచారం. క్యాపిటల్ గ్రూప్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, నార్వే వెల్త్ ఫండ్‌తో పాటు గ్లోబల్ ఇన్వెస్టర్లు భారీ ఎత్తున పోటీ పడటంతో దేశీయ మార్కెట్లలో సరికొత్త ఉత్సాహం నెలకొంది.
భారత క్యాపిటల్ మార్కెట్ చరిత్రలోనే రికార్డు: జియో ఐపీవో యాంకర్ బుక్కు రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు
రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకు గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి కనీవినీ ఎరుగని రీతిలో స్పందన లభించింది.
అక్షర పరిమాణం
- యాంకర్ బుక్ కేటాయింపు రూ.8,110 కోట్లకు గాను 30 రెట్లకు పైగా డిమాండ్ నమోదైంది. బ్లాక్‌రాక్, ఫిడెలిటీ, జేపీ మోర్గాన్, ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ తదితర అంతర్జాతీయ సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి.






