అమరావతి - అభ్యుదయం ఆంధ్ర ప్రదేశ్ హెచ్ పి వి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం లక్ష్యానికి చేరువైంది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 98.47 శాతం పంపిణీ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు.
మిగిలిన 5,269 మందికి కూడా వ్యాక్సిన్ అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. కొత్తగా అవసరమైన వారికి కూడా వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా రాష్ట్రానికి అదనపు డోసులు తీసుకురావాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మహిళలు, బాలికల ఆరోగ్య రక్షణలో హెచ్‌పీవీ టీకా ప్రాధాన్యతను అధికారులు వివరించారు.
హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీలో 98.47 శాతం పూర్తి
ఆంధ్ర ప్రదేశ్ హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 98.47 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముఖ్యాంశాలు
అక్షర పరిమాణం
- మిగిలిన 5,269 మందికి వ్యాక్సిన్ అందించేందుకు చర్యలు చేపట్టారు.
- కొత్తగా అవసరమైన వ్యాక్సిన్ డోసుల కోసం రాష్ట్రానికి 1.90 లక్షల డోసులు అందుబాటులోకి తీసుకురానున్నారు.






