పుష్కర ఎత్తిపోతల పైప్‌లైన్ పనుల్లో జాప్యంపై మంత్రి నిమ్మల ఆగ్రహం
పుష్కర ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. పనులు ఆశించిన స్థాయిలో సాగకపోవడంపై అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
అక్షర పరిమాణం
🕒 13, ఆగ 2026👁 5 వీక్షణలు
పైప్‌లైన్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు.
పుష్కర ఎత్తిపోతల పథకం పనులపై అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు.
అమరావతి - అభ్యుదయం అభ్యుదయం: అమరావతి: పుష్కర ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పనుల పురోగతిపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు.
పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంపై మంత్రి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రాజెక్టుకు సంబంధించిన కీలక పనుల్లో జాప్యం జరగకుండా నిర్దిష్ట వర్క్ షెడ్యూల్‌తో ముందుకు వెళ్లాలని సూచించారు.
కాంట్రాక్టు ఏజెన్సీల పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.