ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పసిడి వినియోగదారు అయిన భారతదేశంలో బంగారం దిగుమతి సుంకాలను 15 శాతానికి పైగా పెంచడం ప్రతికూల ప్రభావాలకు దారితీసింది. పన్ను భారాన్ని తప్పించుకునేందుకు వ్యాపారులు స్మగ్లింగ్, అనధికారిక మార్గాలపై ఆధారపడుతున్నారని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా త్రైమాసిక నివేదికలో హెచ్చరించింది. ಜುಲೈ-సెప్టెంబర్ కాలంలో అనధికారిక పసిడి ప్రవాహం 1500% పెరిగినట్లు 'మెటల్స్ ఫోకస్' గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బిల్లులు లేని నగదు కొనుగోళ్లు పెరిగిపోవడంతో ప్రభుత్వ ఖజానా రాబడికి తీవ్ర గండి పడుతోందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో 1500 శాతం పెరిగిన గోల్డ్ స్మగ్లింగ్: వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక
బంగారం దిగుమతి సుంకాలు పెరగడంతో దేశంలోకి అక్రమ మార్గాల్లో పసిడి రవాణా రికార్డు స్థాయిలో 1500 శాతానికి పైగా పెరిగిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) వెల్లడించింది.
అక్షర పరిమాణం
- గతేడాది మూడో త్రైమాసికంలో 3 మెట్రిక్ టన్నులుగా ఉన్న అనధికారిక బంగారం సరఫరా ఈ ఏడాది ఏకంగా 50 మెట్రిక్ టన్నులకు చేరింది. పన్నుల భారం పెరగడంతో రిటైల్, హోల్సేల్ మార్కెట్లలో బిల్లులు లేని నగదు లావాదేవీలు విచ్చలవిడిగా సాగుతున్నట్లు నివేదిక వెల్లడించింది.






