హైదరాబాద్ ):
కారాగారాల్లోని ట్రాన్స్జెండర్లు, LGBTQ+ వర్గాలకు చెందిన ఖైదీల భద్రత, జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. హైదరాబాద్ సెంట్రల్ జైలులో విభిన్న లింగ గుర్తింపులు, వ్యక్తీకరణలు కలిగిన వ్యక్తుల కోసం ప్రత్యేక ‘జెండర్ న్యూట్రల్ సెల్’ ఏర్పాటు చేసినట్లు జైలు యంత్రాంగం ఎన్హెచ్ఆర్సీకి ధ్రువీకరించింది.
ట్రాన్స్జెండర్ల హక్కుల కోసం నియమితులైన ఎన్హెచ్ఆర్సీ ప్రత్యేక మానిటర్ అక్టోబర్ 8న హైదరాబాద్ సెంట్రల్ జైలును సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA), ఎన్హెచ్ఆర్సీ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రత్యేక వసతి కల్పించాలని ఆదేశించారు. ఆ సిఫార్సులను అమలు చేస్తూ జైలు సూపరింటెండెంట్ సమర్పించిన నివేదిక ప్రకారం, ఖైదీల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా ఈ ప్రత్యేక సెల్‌ను అందుబాటులోకి తేవడంతో పాటు, వారి ఇష్టానుసార వస్త్రధారణకు (Affirmative Clothing) పూర్తి అనుమతినిచ్చారు.
మూలం (Source): ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB ఢిల్లీ)






