సద్దుల బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా నగర ప్రజలు సొంతూళ్లకు బయలుదేరడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై విపరీతమైన రద్దీ ఏర్పడింది. చౌటుప్పల్ పరిధిలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద టోల్ చెల్లింపుల ఆలస్యం, ఫ్లైఓవర్ పనుల కారణంగా వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు లక్కారం, వలిగొండ మార్గాల ద్వారా వాహనాలను దారి మళ్లించి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
పండుగల రద్దీతో రహదారులపై ట్రాఫిక్ జామ్: పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాల బారులు
బతుకమ్మ, దసరా వేడుకల కోసం హైదరాబాద్ నగరం నుంచి ప్రజలు భారీగా తరలివెళ్లడంతో జాతీయ రహదారి 65పై ట్రాఫిక్ స్తంభించింది.
అక్షర పరిమాణం
- చౌటుప్పల్ మండలం పంతంగి టోల్గేట్ వద్ద కిలోమీటర్ల మేర నిలిచిపోయిన కార్లు, బస్సులు.
- రద్దీని నియంత్రించేందుకు వలిగొండ మీదుగా చిట్యాలకు వాహనాల మళ్లింపు.






