హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో తెలంగాణ హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం న్యాయపోరాటాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంబంధిత శాఖల అధికారులు, న్యాయ నిపుణులతో చర్చించి కీలక సూచనలు చేశారు.
తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటి వాటా సాధించేందుకు అవసరమైన అన్ని ఆధారాలను సిద్ధం చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్తో వివాదం ఉన్న అంశాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించి, సుప్రీంకోర్టు, ట్రిబ్యునల్ ముందు సమర్థవంతంగా వాదనలు వినిపించాలని ఆదేశించారు.
ప్రాజెక్టుల నిర్మాణం, నీటి కేటాయింపులు, సాగునీటి అవసరాలు తదితర అంశాలపై స్పష్టమైన నివేదికలు రూపొందించాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది.






