రానున్న 9 నెలలు తీవ్ర కరువు ముప్పు: సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక
ఎల్ నినో ప్రభావంతో వచ్చే ఏడాది జూలై వరకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొంటాయని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. వేసవిలో తాగునీటికి సైతం కటకట ఏర్పడే ప్రమాదముందని, ఈ వాస్తవాన్ని దాచకుండా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలను చైతన్యపరచాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
అక్షర పరిమాణం
🕒 24, అక్టో 2026👁 17 వీక్షణలు
ఎల్ నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలపై ఉందని, కరువును రాజకీయం చేస్తూ హరీశ్‌రావు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
సంక్రాంతి తర్వాత ఉపాధి హామీ అనుసంధానంతో గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రజాభవన్‌లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. Source:
హైదరాబాద్ ప్రజాభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎల్ నినో ప్రభావంతో చిన్నగా మొదలైన కరువు వచ్చే ఏడాది జూలై వరకు కొనసాగనుందని, రానున్న తొమ్మిది నెలలు అత్యంత క్లిష్టకర పరిస్థితులు ఎదురుకానున్నాయని తెలిపారు. ఈ నిజాన్ని దాచిపెడితే అది కేన్సర్‌లా మారుతుందని, అందుకే తాము అసెంబ్లీలో చర్చించి క్యాబినెట్ సబ్ కమిటీని వేశామన్నారు. మహారాష్ట్రలోని కచ్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే నీటి వినియోగంపై రేషన్ విధించారని గుర్తుచేశారు.