దసరా పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు టీజీఎస్ఆర్టీసీ పక్కా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7 వేల ప్రత్యేక బస్సులను నడపనుంది. ఇందులో భాగంగా రీజియన్ల వారీగా ఆదిలాబాద్ 431, నిజామాబాద్ 719, కరీంనగర్ 1175, వరంగల్ 530, ఖమ్మం 678, మహబూబ్ నగర్ 645, మెదక్ 255, నల్గొండ 816, రంగారెడ్డి 440 సర్వీసులు నడపనున్నారు. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, గచ్చిబౌలి వంటి కీలక రద్దీ ప్రాంతాల నుంచి బస్సులను అందుబాటులో ఉంచుతున్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆయా బస్టాండ్లలో పందిళ్లు, షామియానాలు, తాగునీరు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, మొబైల్ టాయిలెట్ల వంటి వసతులను ఆర్టీసీ యాజమాన్యం సిద్ధం చేస్తోంది

For more information on this article, please refer to Page Number 1 & 2, అభ్యుదయం (Abhyudayam) E-paper dated 08-10-2026.