హైదరాబాద్ - అభ్యుదయం హైదరాబాద్:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ వేదికగా ప్రతిష్టాత్మక ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0’ నిర్వహించనున్నట్లు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ థీమ్‌తో జరగనున్న ఈ సదస్సులో తెలంగాణ సాధించిన పారిశ్రామిక ప్రగతిని ప్రపంచానికి చాటనున్నారు.
అలాగే, క్యూర్ పరిధిలోని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం భూములు కేటాయించాలని, ఆటో డ్రైవర్లకు సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని నిర్ణయించారు. మద్దూరు-నారాయణపేట-కోడంగల్ ఎత్తిపోతల పథకానికి రూ.2,100 కోట్ల పరిపాలనా అనుమతులతో పాటు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’.. కేబినెట్ కీలక నిర్ణయాలు
రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా డిసెంబర్లో ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ థీమ్‌తో ప్రతిష్టాత్మక ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
అక్షర పరిమాణం
- ‘క్యూర్’ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు భూ కేటాయింపులు, ఆటోలకు విడతల వారీగా ఇన్సూరెన్స్ రాయితీ పథకం.
- మద్దూరు-నారాయణపేట-కోడంగల్ ఎత్తిపోతల పథకానికి రూ. 2,100 కోట్ల అంచనాలకు ఆమోదం.






