హైదరాబాద్, అభ్యుదయం కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) ద్వారా 'తెలంగాణ రైజింగ్-2047' లక్ష్యసాధనలో భాగస్వాములు కావాలని కార్పొరేట్ సంస్థలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.
ప్రభుత్వం, పరిశ్రమలు, సమాజం సమష్టిగా కృషి చేస్తేనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యపడుతుందని ఆయన అన్నారు.






