పన్ను వసూళ్లలో ఇబ్బందులు లేకుండా, రాష్ట్ర ఖజానాకు రాబడిని పెంచుకుంటూనే సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

అన్ని శాఖల సమన్వయంతో జీఎస్టీ ఆదాయాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ సామాగ్రి జీఎస్టీలో లీకేజీలున్నాయని, వాటిని అరికట్టాలని సూచించారు.

అనుమతుల దశలోనే పన్ను అంచనా వేయాలని, తద్వారా ఆదాయ వసూళ్లు మెరుగుపడతాయని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించి పన్ను ఎగవేతలను గుర్తించాలని అన్నారు.

ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్‌తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాబడి మార్గాలపై చర్చించారు.