తెలుగు భాష, సాహిత్య రంగానికి విశేష సేవలు అందిస్తున్న కవి, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజను 2026 తెలంగాణ తెలుగు తేజం సాహిత్య పురస్కారానికి ఎంపిక చేశారు.
తెలంగాణ తెలుగు భాషా పరిరక్షణ సంఘం, తెలంగాణ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో అందిస్తున్న ఈ పురస్కారాన్ని సెప్టెంబర్ 22న కరీంనగర్‌లో జరిగే కార్యక్రమంలో అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.