కూకట్‌పల్లి జేఎన్టీయూ హాస్టల్‌లో తీజ్ ప్రోగ్రామ్ సందర్భంగా గౌతమి, మంజీర హాస్టల్ విద్యార్థుల మధ్య వివాదం తలెత్తింది. ఈ వివాదం ఘర్షణగా మారి విద్యార్థులు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణతో యూనివర్సిటీ ప్రాంగణంలో భయాందోళన నెలకొంది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు కేపీహెచ్‌బీ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి సద్దుమణిగినప్పటికీ, విద్యార్థుల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోందని సమాచారం.