ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ వరుస పాన్-ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. వాటిలో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫౌజీ', సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్ 'స్పిరిట్' చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రాల రిలీజ్ విషయంలో కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో సందిగ్ధత నెలకొంది. తాజాగా ప్రభాస్ 'ఫౌజీ' కంటే ముందే 'స్పిరిట్' చిత్రాన్ని రిలీజ్ చేయడానికి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. 'ఫౌజీ' చిత్రాన్ని తొలుత 2026 డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయాలని భావించినప్పటికీ, చిత్రీకరణ ఆలస్యమవుతుండటంతో ఆ తేదీకి సినిమా రావడం కష్టమని మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్ వెల్లడించారు. మరోవైపు సందీప్ రెడ్డి వంగా పూర్తి పక్కా ప్రణాళికతో 'స్పిరిట్' షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తుండటంతో, ప్రభాస్ తన 25వ చిత్రమైన 'స్పిరిట్'ను ముందుగా 2027 మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

For more information on this article, please refer to Page Number 8, అభ్యుదయం (Abhyudayam) E-paper dated 08-10-2026.