హైదరాబాద్, అభ్యుదయం: వరుస విజయాలతో జోరు మీదున్న నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రం 'దాదా'తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి తొలి గీతం 'దాదా ధమాకా'ను నవంబర్ 13న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ పాటలో బాలయ్య తనదైన స్టైల్లో స్టెప్పులు వేయడమే కాకుండా, స్వయంగా పాడటం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. డిసెంబర్ 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.