హైదరాబాద్‌లో జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి (SZC) సమావేశంలో తెలంగాణ సాగునీటి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో కీలకమైన ఎత్తిపోతల పథకాల నిర్వహణకు, వరదల వల్ల దెబ్బతిన్న బ్యారేజీల పునరుద్ధరణకు కేంద్రం ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
​అలాగే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద షెడ్యూల్ 9, 10లలోని ఆస్తుల పంపకాలు, విద్యుత్ బకాయిల చెల్లింపుల అంశాలపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. భద్రాచలం పరిధిలోని గ్రామాలను తెలంగాణలో విలీనం చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.