స్పై డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘సీక్రెట్‌ సోల్జర్‌’ సినిమా నుంచి మరో పాట విడుదలైంది. నిహాల్‌ కోదాటి, సూర్య శ్రీనివాస్‌ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాకు అక్కి విశ్వనాథ్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
మూన్‌ లైట్‌ ఎస్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో కమల్‌ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్‌, శ్రీనివాస్‌ వర్లమాని, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్‌, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ‘ఓయ్‌ ఓయ్‌..’ అంటూ సాగే కొత్త పాటను చిత్ర బృందం విడుదల చేసింది.
ఈ పాటకు కార్తీక్‌ రోడ్రిగ్స్‌ సంగీతం అందించగా, రెహమాన్‌ సాహిత్యం అందించారు. కార్తీక్‌ స్వయంగా పాటను ఆలపించారు.
స్పై డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్‌ 18న థియేటర్లలో విడుదల కానుంది.