దేశంలోని అత్యంత ధనవంతుల వివరాలతో కూడిన ‘హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026’ తాజా నివేదికను విడుదల చేసింది. భారత వినోద రంగంలో అత్యధిక సంపద కలిగిన నటుడిగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ రికార్డు సృష్టించారు. గత ఏడాది ఆయన ఆస్తి రూ.12,490 కోట్లుగా ఉండగా, వ్యాపార పెట్టుబడుల హెచ్చుతగ్గుల కారణంగా ఈ ఏడాది రూ.2,490 కోట్లు తగ్గి ప్రస్తుతం రూ.10,000 కోట్లకు చేరుకుంది. ఆయనకు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువను లెక్కించి ఈ సంపదను నిర్ధారించారు. ఈ జాబితాలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ రూ.4,000 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో నిలవగా, సల్మాన్ ఖాన్ రూ.3,000 కోట్లతో మూడో స్థానంలో, హృతిక్ రోషన్ రూ.2,500 కోట్లతో నాల్గో స్థానంలో నిలిచారు. కాగా షారుఖ్ ప్రస్తుతం సుజోయ్ ఘోష్, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రానున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్’ షూటింగ్‌లో శరవేగంగా పాల్గొంటున్నారు.
మరింత సమాచారం కోసం ‘అభ్యుదయం’ ఈ-పేపర్ పేజీ నంబర్ 8 చూడండి (తేదీ: 25-09-2026).






