సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన రోజుగా సెప్టెంబర్ 17కు చారిత్రక ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు.
విమోచన ఉద్యమం, నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం, ప్రజల త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. చరిత్రను వాస్తవ ఆధారాలతో అధ్యయనం చేసి పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు.