ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క మాట్లాడారు. ప్రతి ఆవాసం నుంచి గ్రామ పంచాయతీకి, అక్కడి నుంచి మండల కేంద్రాలకు మెరుగైన రోడ్డు కనెక్టివిటీ కల్పించడమే తమ ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత నెల ములుగులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ హ్యామ్ ప్రాజెక్టు పైలాన్‌ను ఆవిష్కరించారని గుర్తుచేశారు. అక్టోబర్ 25 నుంచి కాంట్రాక్ట్ ఏజెన్సీలు పనులు ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. దీంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని, రాబోయే 10-15 రోజుల్లో కొత్త పింఛన్ల పంపిణీ చేపడతామని స్పష్టం చేశారు. పేదలకు పారదర్శకంగా నిత్యావసరాలు అందించేందుకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలతో పాటు ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో పేదలకే తొలి ప్రాధాన్యం ఉంటుందని వెల్లడించారు.

For more information on this article, read page number 1, 2 & 5 of అభ్యుదయం (Abhyudayam) e-paper dated 26-09-2026.