హైదరాబాద్ - అభ్యుదయం హైదరాబాద్:
విద్య ద్వారానే ఆత్మగౌరవం, గుర్తింపు లభిస్తాయని, విద్య ఒక్కటే తరతరాల మార్పునకు సాధనమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని అశోక్ నగర్ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను సీఎం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కుల విద్యల పేరుతో బడుగు, బలహీన వర్గాల ప్రజలను చదువుకు దూరం చేసిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఆ ఆలోచనలను పక్కనపెట్టి రాష్ట్రవ్యాప్తంగా విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తోందని తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో రూ.2 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. నర్సరీ స్థాయి నుంచే విద్యార్థులకు ఉచిత బ్రేక్‌ఫాస్ట్, పుస్తకాలు, అత్యాధునిక వసతులు కల్పించి ప్రపంచ స్థాయి పోటీకి వారిని సన్నద్ధం చేస్తామని హామీ ఇచ్చారు.
చదువుతోనే ఆత్మగౌరవం, గుర్తింపు: విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి
చదువుతోనే తరతరాల పేదరికాన్ని రూపుమాపవచ్చని, కులరహితంగా సమాజంలో అందరికీ ఒకే నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
అక్షర పరిమాణం
- 119 నియోజకవర్గాల్లో ఒక్కో చోట రూ.2 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు.
- నర్సరీ నుంచే అల్పాహారంతో పాటు అన్ని సదుపాయాలు; నాణ్యమైన విద్య ద్వారా పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి అవకాశాలు.






