ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ప్రపంచ ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లోనూ భారత్, పోలండ్ దేశాలు వృద్ధి, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌లకు కేంద్రాలుగా ఎదుగుతున్నాయని వివరించారు.
పోలండ్ జీడీపీ ఒక ట్రిలియన్ డాలర్లకు చేరినందుకు ప్రధాని టస్క్‌ను ఆయన అభినందించారు. భారత్-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలపడతాయని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు.

(ఈ వార్త పూర్తి వివరాలు ఈ-పేపర్ పేజీ 1 & 2 లో చూడవచ్చు)