తమిళ చిత్రసీమలో శిఖర సమానులైన రజినీ, కమల్ ఇద్దరూ తమకంటూ ప్రత్యేక శైలితో దశాబ్దాలుగా వెండితెలను ఏలుతున్నారు. ఒకరి సినిమాలో మరొకరు అతిథి పాత్రల్లో కనిపించినప్పటికీ, పూర్తిస్థాయి మల్టీస్టారర్ కోసం అభిమానులు 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. జైలర్ చిత్రంతో భారీ హిట్ కొట్టిన నెల్సన్ ఈ ఇద్దరు దిగ్గజాలను ఒకే ఫ్రేమ్‌లో చూపించేందుకు స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

అభ్యుదయం దినపత్రిక (పేజీ 8)