తెలంగాణ విద్యావిధానంలో సమూల మార్పులు.. వచ్చే ఏడాది నుంచే 10+2 విధానం అమలు.
రాష్ట్ర విద్యాప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే 10+2 విధానాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
అక్షర పరిమాణం
🕒 12, నవం 2026👁 3 వీక్షణలు
నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, 9 నుంచి 12వ తరగతి వరకు ప్రత్యేక విద్యా విధానం రూపొందించనున్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు 12వ తరగతి నుంచే నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేయనున్నారు.
విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
హైదరాబాద్, అభ్యుదయం: తెలంగాణ రాష్ట్ర విద్యావ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆధునిక కాలంలో వస్తున్న మార్పులు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పాఠ్యప్రణాళికను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యాశాఖపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. సంస్కరణల అమలులో ఏ ఒక్క విద్యార్థికీ నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ విద్యాసంస్థలపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెరిగేలా తరగతి గదులు, బోధనా సదుపాయాలు మెరుగుపరచాలని ఆదేశించారు.