సెరికల్చర్ విద్యతో ఉజ్వల భవిష్యత్తు: కాకతీయ వర్సిటీ ఆచార్యులు
పట్టుపరిశ్రమ (సెరికల్చర్) విద్యను అభ్యసించిన వారికి జాతీయ స్థాయిలో విస్తృత ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కాకతీయ వర్సిటీ సెరికల్చర్ విభాగ ఆచార్యులు తెలిపారు. 1990 నుంచి డిప్లొమా, 2022 నుంచి ఎంఎస్సీ కోర్సులను విజయవంతంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
అక్షర పరిమాణం
🕒 24, అక్టో 2026👁 8 వీక్షణలు
సెంట్రల్ సిల్క్ బోర్డులో సైంటిస్ట్-బి వంటి అత్యున్నత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ కోర్సులు మార్గం సుగమం చేస్తాయి. వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనలో గ్రామీణ ఉపాధి, దేశీయ పట్టు ఉత్పత్తిని పెంచేందుకు ఈ విద్య ఎంతో దోహదపడుతుంది.
కేయూ సెరికల్చర్ ప్రొఫెసర్లు డాక్టర్ కె. సుజాత, డాక్టర్ కనీజ్ ఫాతిమా కోర్సుల ప్రాధాన్యతను వివరించారు. పరిశోధన, పట్టు విత్తనోత్పత్తి, నాణ్యతా విశ్లేషణ వంటి విభాగాల్లో నిపుణుల కొరత ఉందని, పట్టు పరిశ్రమపై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ సాంకేతిక కోర్సుల్లో చేరి స్వయం ఉపాధితో పాటు మంచి కెరీర్ను నిర్మించుకోవచ్చని సూచించారు.