అభ్యుదయం: హైదరాబాద్‌లో నిషేధిత భూములు, భూ సంబంధిత దరఖాస్తులపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
భూ సంబంధిత దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిశీలించాలని, నిర్ణీత గడువులోగా వాటి వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని మంత్రి స్పష్టం చేశారు.
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న వివరాలను పరిశీలించిన అనంతరం మాత్రమే తదుపరి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
నిషేధిత భూములపై ప్రజలు ఆందోళన చెందొద్దు
నిషేధిత భూముల అంశంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దరఖాస్తులను వేగంగా పరిశీలించి, ఆన్లైన్ వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
అక్షర పరిమాణం
- అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం – మంత్రి పొంగులేటి
- ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో రాజీ ఉండదని స్పష్టం






