ఎన్ఐయూఎం క్యాంపస్ నమూనాను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, అధికారులు.
హైదరాబాద్ శివారులోని ఫ్యూచర్ సిటీలో పట్టణ పాలన, మౌలిక వసతులపై అధ్యయనం కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ (NIUM) భవన సముదాయాన్ని నిర్మిస్తున్నట్లు పురపాలక శాఖ కార్యదర్శి టి.కె. శ్రీదేవి వెల్లడించారు. సుమారు రూ.200 కోట్ల వ్యయంతో సంజయ్ పూరి ఆర్కిటెక్ట్స్ దీనిని నెట్ జీరో క్యాంపస్‌గా డిజైన్ చేశారు. సోలార్ విద్యుత్, వర్షపు నీటి నిల్వ జలాశయం, 80 శాతం పునర్వినియోగ నిర్మాణ వ్యర్థాల వినియోగంతో ప్రాకృతిక వాతావరణం ఉట్టిపడేలా నిర్మాణాలు చేపడతారు.
మరింత సమాచారం కోసం అభ్యుదయం ఈ-పేపర్ తేదీ: 20-10-2026, పేజీ నంబర్: 1 & 2 చదవండి.