తెలంగాణ ప్రభుత్వం కొత్త పింఛన్ల పంపిణీకి చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం వాటి పరిశీలన, అర్హుల ఎంపిక ప్రక్రియను కొనసాగిస్తోంది.
క్షేత్రస్థాయిలో అర్హతలను పరిశీలించి తుది జాబితా సిద్ధం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అర్హులైన వారికి దసరా నుంచి పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు కథనం పేర్కొంది.