హైదరాబాద్: తెలంగాణ పోలీసు శాఖ ఆధునిక సాంకేతికత వినియోగంలో మరో ముందడుగు వేసింది. నేర పరిశోధన విభాగం (సీఐడీ) రూపొందించిన 7 అత్యాధునిక సాంకేతిక సేవలను డీజీపీ కార్యాలయంలో డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. వీటిలో పిటిషన్లు, ఎఫ్ఐఆర్లు, ఈ-చలాన్లు, పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ సేవలపై ప్రజల అభిప్రాయాలను నమోదు చేసుకునే 'సిటిజన్ ఫీడ్‌బ్యాక్ సెంటర్' ప్రధానమైనది. మహిళలు, చిన్నారుల భద్రత కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35 భరోసా కేంద్రాలను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకొచ్చారు. అలాగే ఎన్ఐసీ ఈ-ప్రిజన్స్ వ్యవస్థను సీసీటీఎన్‌ఎస్‌తో అనుసంధానించి రూపొందించిన 'జైల్ రిలీజ్ మానిటరింగ్ సిస్టమ్' ద్వారా ఖైదీల విడుదల వివరాలు వెంటనే సంబంధిత స్టేషన్లకు చేరుతాయి. దీంతోపాటు 9.8 లక్షల రికార్డులతో కూడిన ఫేస్ సెర్చ్ యాప్ ద్వారా కేవలం 15 సెకన్లలో అనుమానితుల ముఖ గుర్తింపు సాధ్యమవుతుందని డీజీపీ వివరించారు.
తెలంగాణ పోలీసు శాఖలో పారదర్శకతకు కొత్త బాట: ఏడు అత్యాధునిక డిజిటల్ సేవలు ప్రారంభం
పోలీసు సేవలను ప్రజలకు మరింత వేగవంతంగా, జవాబుదారీతనంతో అందించేందుకు సీఐడీ విభాగం అభివృద్ధి చేసిన ఏడు డిజిటల్ అప్లికేషన్లను డీజీపీ సీవీ ఆనంద్ లాంఛనంగా ప్రారంభించారు
అక్షర పరిమాణం
- పౌరుల నేరుగా ఫీడ్‌బ్యాక్ సేకరించేందుకు 'సిటిజన్ ఫీడ్‌బ్యాక్ సెంటర్' (CFC) ఏర్పాటు.
- జైళ్ల నుంచి ఖైదీలు విడుదల కాగానే అధికారులకు ఎస్ఎంఎస్ అలర్ట్స్ పంపే 'జేఆర్ఎంఎస్' (JRMS) వ్యవస్థ అందుబాటులోకి.






