అభ్యుదయం - రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో నేరెళ్ల శారద పదవీ బాధ్యతల స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వేద పండితులు మంత్రోచ్ఛారణలతో ఆమెను ఆశీర్వదించారు. అనంతరం ఆమె అధికారిక దస్త్రాలపై సంతకం చేసి బాధ్యతలు చేపట్టారు.

ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కమిషన్ ఉన్నతాధికారులు, సిబ్బంది, శారద సన్నిహితులు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళల సమస్యల పరిష్కారానికి, న్యాయ సహాయానికి మహిళా కమిషన్ నిరంతరం అండగా ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.